భారత రాజ్యాంగం – మన హక్కులకు రక్షణ కవచం
సూరారం కాలనీలోని అంబేద్కర్ గ్రౌండ్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
నేడు నవంబర్ 26, 2026 గురువారం రోజున సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీలోని అంబేద్కర్ గ్రౌండ్ లో డా. బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు శ్రీ వారాల వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని, డా. బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించిందని, 1950 జనవరి 26 నుండి పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిందని గుర్తుచేశారు. రాజ్యాంగ రూపకల్పనలో ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డా. బి.ఆర్. అంబేద్కర్ పోషించిన పాత్ర చిరస్మరణీయమైనదని కొనియాడారు.
రాజ్యాంగం మనకు ఇచ్చిన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం అనే విలువలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని, రాజ్యాంగాన్ని గౌరవించడమే నిజమైన దేశభక్తి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో BRS నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్ గారు, , కార్యకర్తలు, బస్తీవాసులు పాల్గొన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు:
శ్రీ M. నాగేశ్వర్ రావు – అధ్యక్షులు
శ్రీ M. రత్న సాగర్ – ప్రధాన కార్యదర్శి
శ్రీ B. కూర్మయ్య – కోశాధికారి

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
