!!రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా ‘సంవిధాన్ రక్షా మార్చ్’.. భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ !!
💥భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ లక్ష్యంగా ఏఐసీసీ పిలుపు మేరకు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు పాల్గొన్నారు.
💥ఈరోజు హైదరాబాద్‌లోని లిబర్టీ సర్కిల్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు సాగిన ఈ భారీ మార్చ్‌లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారితో కలిసి కూన శ్రీశైలం గౌడ్ గారు పాల్గొన్నారు.
💥ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులు, లౌకికవాదం, సామాజిక న్యాయం, సమానత్వ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బీజేపీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరచడంతో పాటు, ఎన్నికల ప్రక్రియలో ఓటు చోరీకి పాల్పడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
💥ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు,ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
