కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ శ్రీ పింకేష్ కుమార్ I.A.S గాజులరామారం సర్కిల్ 57 పరిధిలో క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా శ్రీవెన్ ఎన్క్లేవ్ కాలనీలోని పార్కు పరిస్థితిని మరియు అక్కడ నెలకొన్న వర్షపు నీటి నిల్వ (వాటర్ లాగింగ్) సమస్యను పరిశీలించి, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అలాగే చింతల్ చెరువు సుందరీకరణ మరియు అభివృద్ధి ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.తదుపరి షాపూర్ మార్కెట్ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం నూతన మరుగుదొడ్ల (టాయిలెట్స్) నిర్మాణ మరియు అభివృద్ధి పనులను పరిశీలించారు.ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పనులను వేగవంతం చేయాలని జోనల్ కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించారు.ఈ తనిఖీలో జోనల్ కమిషనర్ తో పాటు డిప్యూటీ కమిషనర్ (DC) వెంకట్రాములు , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) గోవర్ధన్ ,Dy.EE (SWM) నిఖిల్ రెడ్డి , ACP సుమిత్ర ,Dy.EE (Engg) మహదేవ్ అనురాగ్ , UBD మేనేజర్ విజయరాణి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
