దుండిగల్ సర్కిల్ పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక:
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా” (రూ. 5 లక్షల జీవిత బీమా – ప్రతి కుటుంబానికీ ఒక భరోసా) పథకంలో భాగంగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), కుత్బుల్లాపూర్ జోన్, దుండిగల్ సర్కిల్-59 పరిధిలో ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించబడుతోంది.
నమోదు కేంద్రాలు:
• బహదూర్‌పల్లి వార్డు ఆఫీసు
• బౌరంపేట వార్డు ఆఫీసు
• దుండిగల్ వార్డు ఆఫీసు
పథకం ముఖ్యాంశాలు:
• రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఆర్థిక భరోసా కల్పించడం.
• కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, ఆర్థిక ఇబ్బందుల నుండి ఆదుకోవడం.
• వయస్సు ధృవీకరణ కోసం ఆధార్ కార్డులోని వయస్సును (18 నుండి 59 ) ప్రాతిపదికగా తీసుకుంటారు.
కావున, దుండిగల్ సర్కిల్ పట్టణ ప్రజలందరూ పై వార్డు ఆఫీసులలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాలను సంప్రదించి, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణి కరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
