దివ్యాంగులకు ట్రాన్స్ జెండర్స్ లకు ఉపాధి హామీ కింద 100 రోజులు పని కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.నర్సరీలు, నీళ్లు పెట్టడం, వన సేవకులు ఇతర పనులు చేసే వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఉపాధి హామీ పథకంలో పనులు కేటాయించడానికి ఆస్పిరేషనల్ (ఆకాంక్షిత) జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెంను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.దివ్యాంగులు చేయగలిగే పనులు మాత్రమే కేటాయించాలని, ట్రాన్స్ జెండర్స్ లకు ఒకే దగ్గర పని కేటాయించాలని ఆదేశించింది. ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, కరకగూడెం మండలాలను సెలెక్ట్ చేసింది.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
