శ్రీ ధర్మ శాస్త్ర శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొని అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్ ..
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ లోని “శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మాన్య శ్రీ అరుణ్ గురు స్వామి, బ్రహ్మ శ్రీ రాజన్ నంబూద్రి గురు స్వామి, శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి ప్రధాన అర్చకులు నాగార్జున ఆచార్యులు (లాలు స్వామి) మరియు కమిటీ సభ్యలు ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలలో శ్రీ శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ఆ అయ్యప్ప స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఉంగరాల శ్రీనివాస్, హరి బాబు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
