కొనుగోలు కేంద్రాల్లో వర్షాలకు వడ్లు తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించిన…………..జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి
జిల్లా లోని అన్ని
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు వర్షానికి తడిచిపోకుండా జాగ్రతలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
ఉదయం గోపాల్ పేట మండలంలోని ఎదుట్ల గ్రామ ఐ.కే.పి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నందున కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిచిపోకుండా టార్ఫాలిన్ లు కప్పి తగు జాగ్రాతకు తీసుకోవాలని సూచించారు.
తేమ శాతం సరిపోయిన వడ్లు త్వరగా తూకం చేసి లారీల్లో ఎక్కించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లారీలు ఎక్కువగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని హమాలీల సంఖ్య పెంచి ధాన్యం త్వరగా తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై అధికారిని ఆదేశించారు. మండలంలో ఇంకా వరి కోతలు జరుగుతున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
అనంతరం కలెక్టర్ గోపాల్ పేట మండలంలోని ఆధునిక వ్యవసాయ గోదాములను సందర్శించారు. గోదాములో పడి ఉన్న పాత గన్ని బ్యాగులను తరలించి గోదాం ఖాళీ చేయించాలని పొర సరఫరాల అధికారులను ఆదేశించారు. ధాన్యాన్ని త్వరగా తరలించడం, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో మాట్లాడి జాప్యం లేకుండా చూడాలని సివిల్ సప్లై అధికారిని ఆదేశించారు.
సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, గోపాల్ పేట తహసిల్దార్ పాండు నాయక్, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
