కార్యకర్తల సంక్షేమానికి నావంతు సహాకారం అందించడం ఎంతో తృప్తినిచ్చింది : మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి
మహానాడు వేదికపై పార్టీ విరాళంగా అధినేత చంద్రబాబునాయుడికి రూ.25లక్షలు అందించాను : ప్రత్తిపాటి
పార్టీని నడిపించే చోదకశక్తులైన కార్యకర్తల యోగక్షేమాల గురించి తపనపడే నాయకుడు పార్టీసారథిగా ఉండటం మనందరి అదృష్టం : ప్రత్తిపాటి
“తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా, మాజీమంత్రిగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తల సంక్షేమానికి, వారి కుటుంబాలకు చేయూతగా నిలిచాను. అధినేత చంద్రబాబు నాయుడి పిలుపునకు స్పందించి, మహానాడు వేదికపై స్వయంగా ఆయనకు రూ.25లక్షల విరాళం అందించడం ఎంతో సంతోషాన్చిచ్చింది. కార్యకర్తల యోగక్షేమాల గురించి తపన పడే నాయకుడు మనకు, మనపార్టీకి సారథిగా ఉండటం మనందరి అదృష్టమనే చెప్పాలి.
చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తున్న లోకేశ్ బాబు సేవల్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. లోకేశ్ ఆలోచనల నుంచి పుట్టిన ‘కార్యకర్తే అధినేత’ అన్న సరికొత్త నినాదం తెలుగుదేశం పార్టీకి కచ్చితంగా కొత్త శక్తియుక్తులు అందిస్తుంది. పార్టీ మనుగడతో పాటు, ఉజ్వల భవిష్యత్ కోసం యువశక్తిని ప్రోత్సహిస్తూనే, అనుభవానికి పెద్దపీటవేసి, పెద్దలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్న లోకేశ్ నిర్ణయం నిజంగా పార్టీకి, ప్రభుత్వానికి సత్ఫలితాలు ఇస్తుంది. విరాళం అందించిన నాయకులతో చంద్రబాబు ప్రత్యేకంగా విందు సమావేశం నిర్వహించి, ప్రతిఒక్కరినీ ప్రత్యేకంగా పేరుపేరునా అభినందించారు” అని మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి ఒక ప్రకటనలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
