రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వనపర్తికి రాక
జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష, పలు భవనాలకు ప్రారంభోత్సవం చేయనున్న ఆరోగ్యం మంత్రి
వనపర్తి జిల్లా
మే, 31న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ వనపర్తి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
ఉదయం కలెక్టర్ తన ఛాంబర్ లో జిల్లా వైద్య శాఖ అధికారులతో శనివారం నాడు మంత్రి వనపర్తి రాక పై సమీక్ష నిర్వహించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మంత్రి అయిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మే 31న వనపర్తి జిల్లా సందర్శించి జిల్లాలో జరుగుచున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షతో పాటు వనపర్తి పట్టణంలో టి.బి. వైద్య కేంద్రాన్ని, మెడికల్ కళాశాల పక్కన నిర్మించిన సెంట్రల్ మెడికల్ స్టోర్ భవనం, ఆర్.బి.ఎస్.కె కు సంబంధించిన బాల స్వాస్థ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు.
ఇంచార్జి మంత్రి పర్యటనకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, డా. రామచంద్ర రావు, డా. పరిమళ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
