Spread the love

అమరావతి మండలం లేమల్లె గ్రామంలో జరుగుతున్న 48వ గుడారాల పండుగ మహోత్సవంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ .

ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణించిన రోజులలో గుడారాలలో నివసిస్తూ దేవుని తలంపును అనుసరించారని దానిని ప్రజలకు తెలియజేస్తూ గుడారాల పండుగను నిర్వహించడం అభినందనీయమన్న ఎమ్మెల్యే.

లక్షల మంది హాజరయ్యే గుడారాల పండుగను ఈ సంవత్సరం లేమల్లె గ్రామంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే.

బ్రదర్ ఏసన్న మొట్టమొదటి హోసన్నా మందిరం లేమల్లె లోనే స్థాపించారన్న ఎమ్మెల్యే.

రాష్ట్రవ్యాప్తంగా 1000కి పైగా చర్చిలు కలిగిన హోసన్నా మినిస్ట్రీస్ రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిస్టియన్ సంస్థగా భావిస్తున్నానన్న ఎమ్మెల్యే

భవిష్యత్తులో హోసన్నా మినిస్ట్రీస్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హామి ఇచ్చిన ఎమ్మెల్యే.