Spread the love

మహబూబాబాద్ జిల్లా..

తెలంగాణ పోలీసు కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సంబంధించి వెబ్‌సైట్‌ https://yipschool.in ను పోలీస్ స్కూల్ వెబ్‌సైట్‌తో పాటు సమగ్ర సమాచారంతో కూడిన బ్రోచర్‌ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారు ఈరోజు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నరేందర్,ఎస్.బి ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, ఆర్.ఐలు సోములు, భాస్కర్, ఐటీ సెల్ ఎస్.ఐ అరుణ్, సిబ్బంది శ్రీధర్ మరియు రవి పాల్గొన్నారు.

2025-26 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లలో పోలీసు అమరుల కుటుంబాల పిల్లలకు మొదటి ప్రాధాన్యత. పోలీస్ కుటుంబాలు మరియు సాధారణ పిల్లలకు స్కూల్ అడ్మిషన్స్ జరుగును.
సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్‌ను కూడా దేశానికి ఒక రోల్ మాడల్‌గా ఉండేలా పిల్లలను తీర్చిదిద్దేల ఈ స్కూల్ ఉంటుందని ఎస్పీ అన్నారు.

విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంభించాలని, క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం స్కూల్ ప్రత్యేకత.