
మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యం : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

నిజాంపేట్ లోని సప్తపది గార్డెన్స్ లో ఆదర్శ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదర్శ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సంధర్బంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ….మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, ఇంట్లో ఒక పురుషుడు చదువుకుంటే ఆ ఇళ్లు మాత్రమే అభివృద్ది చెందుతుందని, అదే ఒక మహిళ చదువు ఆ కుటుంబంతో పాటు సమాజాభివృద్ధికి దోహదపడుతుందని, మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించినపుడే దేశాభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగారాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు ప్రణయ ధన్ రాజ్ యాదవ్, గాజుల సుజాత, విజయలక్ష్మీ, నాయకులు సాంబశివా రెడ్డి, ఆదర్శ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చలసాని భారతి, శ్రీలత, పద్మ, సుజాత, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.