Spread the love

మృతుల కుటుంబాలకు పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ….

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 44 డివిజన్ పరిధిలోని కడిపికొండ ప్రాంతానికి చెందిన మాజీ బ్లాక్ అధ్యక్షులు నర్మేట వెంకటరమణ గౌడ్ తల్లి నర్మేట సరోజన మరణించగా వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి …

45వ డివిజన్ పరిధిలోని తరాలపల్లి గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ర హరీష్ రెడ్డి బంధువు పుల్యాల కృష్ణారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు వారి వివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు…

అనంతరం ఐనవోలు మండల పరిధిలోని వనమాలకనపర్తి గ్రామంలో గత కొద్దిరోజుల క్రితం మరణించిన మాజీ డైరెక్టర్ మరకాల లక్ష్మి , రిషిక సుధాకర్ , గట్టు రాజేష్ గౌడ్, ల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు….

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..