
మౌలిక వసతుల కల్పనతో డివిజన్ అభివృద్ధికై మరింత కృషిచేస్తాం: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ….
126 – జగద్గిరిగుట్ట డివిజన్ సంజయ్ పురి కాలనీలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 30 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. మౌలిక వసతుల కల్పనలో భాగంగా డివిజన్ పరిధిలో మిగిలిపోయి ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, శ్రీ వేంకటేశ్వర దేవస్థానం మాజీ ఛైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు మరియు దేవమ్మ బస్తీ అధ్యక్షులు రుద్ర అశోక్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, సీనియర్ నాయకులు బాబు గౌడ్, పాపి రెడ్డి, మల్లేష్ గౌడ్, జైహింద్, మజ్జి శ్రీనివాస్, విఠల్ ముదిరాజ్, ముంతాజ్, అజం, నాని, నాగరాజు గౌడ్, మహేందర్, జయకృష్ణ, సంజయ్ పురి కాలనీ అధ్యక్షులు జి.అరుణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు హరి శర్మ, షౌకత్ పాషా, కాలనీవాసులు శ్రీను, మల్లేష్ గౌడ్, దామోదర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
