Spread the love

ఉమ్మడి కృష్ణా,గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి – మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్.

ఆర్టీసీ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత మొదటిసారి రాజేంద్రప్రసాద్ ఇంటికి విచ్చేసిన సందర్భంగా కొనకళ్ల నారాయణరావు ని సన్మానించిన రాజేంద్రప్రసాద్ మరియు ఇతర తెదేపా నాయకులు .

ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ…

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉయ్యూరు రావడం జరిగినదని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే మన కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని, రేపు 27 తేదీన జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నారాయణ రావు అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…

గత వైసిపి ప్రభుత్వం లో రాష్ట్రం అన్ని రంగాల్లో ఏవిధంగా అభివృద్ధిలొ వెనుకబడిందో మనందరం చూసామని, ఉద్యోగాలు లేక యువత భవిష్యత్తుని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, టీచర్స్ ని బ్రాందీ షాపుల దగ్గర కాపలాగా పెట్టి వారి మనోభావాల్ని కించపరిచిందని, మళ్లీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలాగా నారా చంద్రబాబునాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని, రేపు జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు జంపాన పూర్ణచంద్రరావు, అబ్దుల్ ఖుదూస్, తెదేపా సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటీ ఫణి, బూరెల నరేష్, నడిమింటి పైడయ్య, కోగంటి శ్రీనివాసరావు, రమణ, అనిల్, తేజా ,శివ, విజయ్, రాజా, భాషే, భాజాని, శ్రీకాంత్, సాయి, శేషు, వాసు తదితరులు పాల్గొన్నారు.