
శ్రీశ్రీశ్రీ డా: ఆదిత్య పరాశ్రీ స్వామి కి రాష్ట్ర ప్రభుత్వం 2+2 సెక్యూరిటీని నియమించాలి.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర్ రాజనర్సింహ కి వినతి పత్రం.
—మీసాల రామన్న మాదిగ
తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు
నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బిజ్వరం గ్రామంలోని, శ్రీశ్రీశ్రీ అంబాత్రేయ క్షేత్రం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామి , మన మాదిగ కులానికి చెందిన గురువుజీ కాబట్టి, స్వామీజీ పైన విమర్శలు చేస్తూ, దాడులు చేయడానికి. బెదిరింపు పోన్ కాల్ వస్తున్నాయని, 2+2 సెక్యూరిటీ ని నియమించాలని, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ చార్జీ మంత్రి దామోదర రాజనర్సింహ నివాసంలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రామన్న మాదిగ తెలిపారు.
మీసాల రామన్న మాదిగ మాట్లాడుతూ… ఇప్పటికే స్వామీజీ పేరు మీద ఇంస్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ తయారు చేసి, స్వామీజీ పేరు మీద పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ, స్వామీజీ పేరు బద్నాం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో నారాయణపేట్ ఎస్పీ కి కంప్లైంట్ చేయడం జరిగిందాని అన్నారు.
మాదిగ కులానికి సంబంధించిన శ్రీశ్రీశ్రీ . డాక్టర్ ఆదిత్య పరశ్రీ స్వామి కి ప్రాణహాని ఉంది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెక్యూరిటీనీ నియమించాలని, తెలంగాణ రాష్ట్రంలో మహా మేధావి, మాదిగ కులంలో పుట్టి ప్రపంచాన్ని చదివిన గొప్ప మరో సంతు రవిదాస్ మహారాజ్ గా మాన్యశ్రీ శ్రీశ్రీశ్రీ డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామి . కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి 2+2 సెక్యూరిటీ నియమించాలని, మన జాతి మహా మేధావి ప్రపంచమే గర్వించదగ్గ శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి . స్వామీజీ కి ప్రాణహాని జరగకుండా తక్షణమే సెక్యూరిటీనీ నియమించాలని వినతి పత్రంలో మంత్రి కి తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డ యాదయ్య మాదిగ, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు గంధం రాములు, తెలంగాణ దండోరా రాష్ట్ర అధ్యక్షుడు దొమ్మింటి శివకుమార్ మాదిగ, తెలంగాణ దండోరా రాష్ట్ర విద్యార్థి ఫోర్స్ కోఆర్డినేటర్ మీసాల ఎల్లేష్ మాదిగ, తెలంగాణ దండోరా మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు భీమ్రాజ్ మాదిగ, తెలంగాణ దండోరా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
