
ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్….
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని సాయిబాబా నగర్ లో ముస్లిం మైనార్టీ సోదరుల ఆహ్వానం మేరకు రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన సందర్భంలో, ఈద్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈద్ అనేది మనల్ని సమాజంగా దగ్గర చేసుకునే కరుణ, ఉదారత, ఐక్యత వంటి విలువలను ఆలోచించే సమయం. ఈ పండుగ ప్రతి ఇంటిలో శాంతి, సౌభాగ్యం, సమృద్ధిని, ఐశ్వర్యం తీసుకురావాలని, అన్ని సమాజాల మధ్య సోదరభావాన్ని మరింత బలపరచాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆనందం, ఆరోగ్యం, నిరంతర అభివృద్ధి కలగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు..
అదేవిధంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో చాంద్ పాషా, ఖలీల్, బహదూర్ ఖాన్, గౌస్ ఖురేషి, బబ్లు, సలీం, రజాక్ బాయ్, ముజాహిద్, ఆసిఫ్, లతీఫ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐ ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్, సిహెచ్ బుచ్చిరెడ్డి, మన్నే రాజు, సంజీవ్, శంకర్, టైగర్ రాములు, మరియు ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు…
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
