
మడికొండ చెరువులో కలుషిత నీటి సమస్యకు తక్షణ పరిష్కారం చూపిన – ఎమ్మెల్యే నాగరాజు …
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని కాజీపేట మండల పరిధిలోని మడికొండ రాంపూర్ డంపింగ్ యార్డు సమీపంలో ఉన్న వాగు ద్వారా కలుషిత నీరు మడికొండ చెరువులోకి చేరుతున్న సమస్యను మడికొండ ముదిరాజ్ సంఘ సభ్యులు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి * కె.ఆర్. నాగరాజు* దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయంపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నాగరాజు డంపింగ్ యార్డు సిబ్బంది మరియు టాటా హీటాక్సీ
మిషన్ సహాయంతో చెరువులోకి వస్తున్న కలుషిత నీటిని నిలువరించేందుకు ప్రత్యామ్నాయ కాలువ తవ్వించి, ఆ నీటిని ఇతర దిశకు మళ్లించే చర్యలు చేపట్టించారు. ఈ చర్యతో మడికొండ చెరువు నీటి కాలుష్యం నివారించబడుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు…
ఈ సందర్భంగా మడికొండ ముదిరాజ్ సోదరులు ఎమ్మెల్యే నాగరాజు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దువ్వా శ్రీకాంత్, దువ్వ నవీన్, చిన్న కుమార్, విజయ్, కొమురయ్య, కుక్కల దేవరాజ్, శ్రీకాంత్, నర్ర దుర్గయ్యతో పాటు ముదిరాజ్ సంఘ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు…
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
