
ట్రాఫిక్ పోలీసుల భద్రతకు రిఫ్లెక్టివ్ బెల్ట్‌లు
రాత్రివేళ విధులు నిర్వహించే సిబ్బంది భద్రతకు ప్రత్యేక చర్యలు….
— సీపీ అంబర్ కిశోర్ ఝా…
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, రామగుండం/ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాత్రివేళల్లో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు రిఫ్లెక్టివ్ బెల్ట్‌లు, బాడీ బెల్ట్‌లు, చీకటిలో స్పష్టంగా కనిపించే భద్రతా పరికరాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రాత్రివేళల్లో చౌరస్తాలు, ప్రధాన రహదారులపై విధులు నిర్వహించే సిబ్బంది వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ట్రాఫిక్ నియంత్రణలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ, రహదారి భద్రతా నిబంధనలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సీపీ సూచించారు. ట్రాఫిక్ పోలీసుల భద్రతతో పాటు వాహనదారులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, ఆర్‌ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
