ఎమ్మెల్యే సాబ్..ఎల్‌ఎల్‌బీ పాస్‌

Spread the love

ఎమ్మెల్యే సాబ్..ఎల్‌ఎల్‌బీ పాస్‌.!
-ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఘనత
-ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే న్యాయ విద్య

అశ్వారావుపేట: ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే.. మరోవైపు తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఎల్‌ఎల్‌బీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు బుధవారం విడుదల అయినా ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణులైనట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ప్రజా జీవితంలో బిజీగా ఉంటూనే న్యాయ విద్యను అభ్యసించడం పట్ల నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

-చదువుకు ప్రాధాన్యం
ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో నిరంతరం పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవడం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం, అధికారులతో సమీక్షలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే జారె ఆదినారాయణ.. తన చదువును మాత్రం కొనసాగించారు. ప్రజాప్రతినిధిగా ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తూనే న్యాయ విద్యను అభ్యసించి ఎల్‌ఎల్‌బీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.

అశ్వారావుపేట నియోజకవర్గంలో విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్నారు. విద్యారంగంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ పాఠశాలలను సందర్శించడం, విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం వంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు.

-న్యాయ విద్యతో అదనపు అవగాహన..
ఎల్‌ఎల్‌బీ తో ప్రజలకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై మరింత అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే అనుచరులు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్న సమయంలో న్యాయ విద్యను అభ్యసించడం ద్వారా రాజ్యాంగం, చట్టాలు, ప్రజల హక్కులు, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంపొందించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఎల్‌ఎల్‌బీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రజా జీవితంలో బిజీగా ఉంటూనే చదువును కొనసాగించడం యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.
ప్రజా సేవతో పాటు వ్యక్తిగత అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్న ఎమ్మెల్యేకు మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు విద్యాభ్యాసాన్ని కొనసాగించడం అభినందనీయమని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top