కౌన్సిల్ సమావేశం వెంటనే నిర్వహించాలి….

Spread the love

కౌన్సిల్ సమావేశం వెంటనే నిర్వహించాలి….

బీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మేకల సమ్మయ్య యాదవ్‌….

పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి గోదావరిఖని, : రామగుండం కార్పొరేషన్‌లో ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రతి డివిజన్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మేకల సమ్మయ్య యాదవ్‌ అన్నారు.

ప్రజల ఆమోదంతో గెలిచిన కార్పొరేటర్లుగా సమస్యలను మేయర్‌, కమిషనర్‌, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.

కార్పొరేటర్లుగా గెలిచి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రెండో కౌన్సిల్‌ సమావేశం నిర్వహించకపోవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు.

తక్షణమే కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలపాలని కోరారు. గత కౌన్సిల్‌ సమావేశంలో కార్పొరేటర్లు ప్రస్తావించిన సమస్యల్లో ఎంతవరకు పరిష్కారం చూపారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో 6వ. డివిజన్‌ కార్పొరేటర్‌ తోకల శ్యామిని రమేష్‌ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top