
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం — మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
షాపూర్నగర్లోని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నివాస కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా వినాయక నవరాత్రి వేడుకల పూజా కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు.
నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
