
భక్తి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం అండ
వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
పట్టణంలోని వాసవి మార్కెట్లో నిర్వహించిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
నందిగామ నియోజకవర్గంలో ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించే కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ కౌన్సిలర్ కృష్ణమూర్తికి ఎమ్మెల్యే పరామర్శ :
శ్రీరామలింగేశ్వరనగర్లో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ వార్డు కౌన్సిలర్ రాటకొండ కృష్ణమూర్తిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆయన స్వగృహంలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్యార్డు వైస్చైర్మన్, డీసీ చైర్మన్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
