గాజులరామారం విలేజ్‌లో జరిగిన గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కూన శ్రీనివాస్ గౌడ్

Spread the love

గాజులరామారం విలేజ్‌లో జరిగిన గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కూన శ్రీనివాస్ గౌడ్

గాజులరామారం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజులరామారం విలేజ్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడిని KKM ట్రస్ట్ అధినేత, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంపాట కార్యక్రమంలో పాల్గొన్న కూన శ్రీనివాస్ గౌడ్ , గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

గణనాథుడి సన్నిధిలో కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో గణేష్ మండప నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు స్థానిక నాయకులు ఇంద్రసేనారెడ్డి, బాలరాజు, ఇంద్రసేనా గుప్త, శ్రీరాములు,R. యాదగిరి, పెంట రెడ్డి,యాదగిరి , వంశీ గౌడ్, కృష్ణ రెడ్డి, సంజీవ్ రెడ్డి,లక్ష్మీనారాయణ రెడ్డి,యం సాగర్, సుజిత్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, దర్శన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, దుర్గయ్య, సురేష్,రుషి కుమార్,మధుసూదన్ రెడ్డి, కూన నరేష్ గౌడ్, వాసు, T.యాదగిరి తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top