
గణపయ్య నీ కృప కటాక్షం మా మీద ఉంచయ్య.
పెళ్లకూరు కాలనీ పి. స్వాతి, గణపయ్య యూత్ సమక్షంలో 700మంది కి పైగా అన్నదానం
వినాయక చవితి సందర్భంగా పి. స్వాతి పెళ్లకూరు కాలనీ గణపయ్య యూత్ ఏర్పాటుచేసిన “గణపయ్య” కోవూరు మండలంలోని పెళ్లకూరు కాలనీలో ప్రత్యేకగా భక్తుల్ని ఆకట్టుకున్న గణపయ్య బొమ్మను పెట్టిన 9వ రోజు దాదాపుగా 700 మందికి పైగా అన్నదాన కార్యక్రమం. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని 5 సంవత్సరాలుగా ఇక్కడ గణపయ్య బొమ్మ పెట్టి వినాయక చవితి వేడుకలను ఘనంగా చేయడం జరుగుతుంది. బొమ్మ పెట్టిన 11 వరోజు ఆ గణపయ్య నిమజ్జనం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా స్వామి వారి ఊరేగింపు పూల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో, మేళ తాళాలతో, బాణాసంచరితో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే మాకు సహకరిస్తున్న పెద్దలకి, పెళ్లకూరు కాలనీ ప్రజలకు, గణపయ్య యూత్ ఉత్సవ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మనోజ్ కుమార్, వెంకటేష్, సునీల్, భాను ప్రకాష్, భాను తేజ, శివ కార్తీక్, రవి, సుమ, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
