
మాజీ మంత్రి నల్లపరెడ్డి సంచలన ప్రకటన..
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థి కడివేటి శ్రీనివాసులు రెడ్డి ప్రకటన..
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రివర్యులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్న నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవికి వైసీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థి కడివేటి శ్రీనివాసులు రెడ్డి ని ముందుగానే ప్రకటిస్తూ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలనం సృష్టించారు.ఎన్నికల షెడ్యూల్కు ముందే చైర్పర్సన్ అభ్యర్థిని ప్రకటించడం ద్వారా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో పార్టీ వ్యూహాన్ని స్పష్టం చేసినట్లు అయింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వార్డు స్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని, నాయకులు–కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని నల్లపరెడ్డి సూచించారు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
