
బుచ్చిరెడ్డిపాళెం అభివృద్ధికి మరో అడుగు.. హ్యామ్తో రూ.22 కోట్ల పనులకు శ్రీకారం
తిరుమల నుంచి వర్చువల్గా హ్యామ్ ప్రాజెక్టుల శంకుస్థాపనలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హ్యామ్ ( హైబ్రిడ్ ఎన్ యు టి మోడల్ ) ప్రాజెక్టుల వర్చువల్ ఫౌండేషన్ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తిరుమల నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో భాగంగా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు రూ.22 కోట్ల నిధులు కేటాయించడంతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
బుచ్చిరెడ్డిపాళెం అభివృద్ధికి భారీ నిధులు
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని అభివృద్ధి చేసే దిశగా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని గ్రేడ్-2 మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. తాజాగా హ్యామ్ విధానంలో భాగంగా మరో రూ.22 కోట్ల నిధులు కేటాయించడంతో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధికి మరింత ఊతం లభించిందని పేర్కొన్నారు. ఇప్పటికే చేపట్టిన రూ.68 కోట్ల పనులకు తాజా రూ.22 కోట్లను కలిపితే మొత్తం దాదాపు రూ.90 కోట్లతో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఏర్పడిందని తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
