
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని కొలన్ హన్మంత్ రెడ్డి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కుత్బుల్లాపూర్ మాజి మహిళా మండల అధ్యక్షురాలు జి. స్వప్న, గడ్డం గాయత్రి, మమత, రాధ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో దూలపల్లి డివిజన్ అధ్యక్షులు శివకుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రసన్న కుమార్, INTUC అధ్యక్షులు ఇల్లేష్ యాదవ్, కుత్బుల్లాపూర్ మండల్ వైస్ ప్రెసిడెంట్ శివాజీ, నాగరాజు, సాయి యాదవ్, ఓబీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు రామ్ యాదవ్, తిరుపతిరావు, సి.హెచ్. నాగరాజు, ఎస్టీ సెల్ అధ్యక్షులు విజయ్ నాయక్, వెంకటేష్, నవీన్ కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
