ఆటో కార్మికుల సమస్యలపై ఐక్యంగా పోరాడుదాం.

Spread the love

ఆటో కార్మికుల సమస్యలపై ఐక్యంగా పోరాడుదాం.
ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఉమామహేష్ పిలుపు.

గండి మైసమ్మ చౌరస్తా నుండి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లు నేడు ఏఐటీయూసీ సంఘంలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఉమామహేశ్వర పాల్గొని వారికి సభ్యత్వాలు ఇచ్చి ఏఐటీయూసీలోకి ఆహ్వానం పలకడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐటీయూసీ కార్మికుల కోసం కార్మిక హక్కులు కాపాడడానికి 100 సంవత్సరాల క్రితమే ఆవిర్భవించి నేటికీ దేశంలో అతిపెద్ద గుర్తింపు సంఘం పనిచేస్తుందని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో విస్తరించబడిన ఏకైక సంఘం ఏఐటీయూసీ అని కావున అందులో చేరి సభ్యత్వం తీసుకోవడం చాలా గర్వకారణం అని అన్నారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వాటిని సాధించుకునేంతవరకు ఆటో డ్రైవర్లు ఐక్యంగా ఉద్యమించాలని దానికి సిపిఐ మరియు ఏఐటియుసి సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమర్ ఖాన్ జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి జిల్లా నాయకులు నర్సింహులు సిపిఐ నాయకులు రాములు బాబు అతిథులుగా పాల్గొని ఆటో డ్రైవర్లకు ఏ కష్టం వచ్చినా స్పందిస్తామని వారి సమస్యల పరిష్కారం కోసం నిత్య అందుబాటులో ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా స్థానిక ఆటో డ్రైవర్లు ఖలీల్ అఖిల్ అహ్మద్ బాబర్ రాములు నరసింహ తదితరులతో పాటు పెద్ద ఎత్తున ఏఐటియుసిలో చేరడం జరిగింది

You cannot copy content of this page

Scroll to Top