
వర్షాల వేళ వినాయక నిమజ్జనంలో అప్రమత్తతే ముఖ్యం!
ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిమజ్జనం నిర్వహించుకోవాలి:ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు
భారీ వర్షాల నేపథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు వినాయక నిమజ్జన కార్యక్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సూచించారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, భక్తులు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన కోరారు.
నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకర ప్రాంతాలు, లోతైన నీటి ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
“వినాయకుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఆనందం వెల్లివిరియాలి.. నిమజ్జన వేడుకలు సురక్షితంగా, ప్రశాంతంగా ముగియాలి” అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆకాంక్షించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
