
గణేశుని విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి రమేష్
కూకట్పల్లి: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కూకట్పల్లి కేపీహెచ్బీ 3వ ఫేజ్ మరియు 4వ ఫేజ్లో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహాలను దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మూసాపేట్ డివిజన్లోని ఆంజనేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో జరుపుకోవడం సంతోషకరమన్నారు. విఘ్నేశ్వర స్వామి ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
