
సిద్ వేరా సెలూన్ షాప్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ గండిమైసమ్మలో పిస్తా హౌస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ వేరా సెలూన్ షాప్ను ప్రారంభించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ సందర్భంగా సెలూన్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. నూతనంగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, సాయి యాదవ్, గోపాల్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, మురళి యాదవ్, బీఆర్ఎస్ సర్కిల్ జనరల్ సెక్రెటరీ కోల్తుర్ మల్లేష్ ముదిరాజ్, పాక్స్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, ప్యాక్ డైరెక్టర్లు నల్తూరి క్రిష్ణ, ఈ శ్రీనివాస్, దుండిగల్ సర్కిల్ బీసి శాఖ అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్, సీనియర్ నాయకులు ఎస్వి సురేందర్ రెడ్డి, ధర్మ రెడ్డి, వేణు గౌడ్, బిక్షపతి గౌడ్, బైండ్ల గోపాల్, బసెట్టిగారి వేణు, మల్లేష్, బొంగునూరి విష్ణువర్ధన్ రెడ్డి, దారా మహేష్, సెలూన్ నిర్వాహకులు కుమార్, మరియు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
