
సుపతం హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
గండి మైసమ్మ: గండి మైసమ్మ చౌరస్తా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సుపతం హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై హాజరై హోటల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ నూతనంగా హోటల్‌ను ఏర్పాటు చేసిన యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. హోటల్ వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు బొగునూరి శ్రీనివాస్ రెడ్డి, రాము గౌడ్, బుచ్చిరెడ్డి, జిమ్మి దేవేందర్, ఏనుగు శ్రీనివాస్ రెడ్డి,కూన రాఘవేందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
