| ప్రగతి నగర్ 2వ డివిజన్‌లో ఘనంగా శ్రీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు

Spread the love

ప్రగతి నగర్ 2వ డివిజన్‌లో ఘనంగా శ్రీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ||

 ప్రగతి నగర్: ప్రగతి నగర్ 2వ డివిజన్‌లోని శ్రీ మహాగణపతి దేవాలయం వద్ద మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై శ్రీ మహాగణపతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు, కాలనీ ప్రజలు హన్మంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధి కలగాలని శ్రీ గణపతి స్వామివారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో 276 ప్రగతి నగర్ డివిజన్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి, 294 బహదూర్‌పల్లి డివిజన్ అధ్యక్షులు మైసిగారి శ్రీనివాస్, ఆంజనేయ వర్మ, వేణు, ఖయ్యుమ్, ఆలేటి శ్రీనివాస్, కాళిదాస్, రాములు నాయక్, సురేందర్ యాదవ్, సుబ్బు, మద్ది నారాయణ రెడ్డి, మేడ శ్రీనివాసరావు, హరీష్, రాజ్ రెడ్డి, సాంబశివరావు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

అలాగే శ్రీ మహా గణపతి ఉత్సవ సమితి సభ్యులు, కాలనీ ప్రతినిధులు దివాకర్, డి. శ్రీనివాసరావు, గణపతి రావు, శ్రీ సాయి గౌడ్, వెంకటేష్, శ్రీకాంత్ పటేల్, విజయ్ భాస్కర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రమేష్, మురళి, ప్రతాప్, రాంపుల్లా రెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top