
ప్రగతి నగర్ NRI కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి ||
ప్రగతి నగర్: NRI కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం హన్మంతన్న గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 276 ప్రగతి నగర్ డివిజన్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి, 294 బహదూర్‌పల్లి డివిజన్ అధ్యక్షులు మైసిగారి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలేటి శ్రీనివాస్, రామచందర్, రవి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
