కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు బీసీలు కృషి చేయాలి: వట్టే జానయ్య యాదవ్

Spread the love

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు బీసీలు కృషి చేయాలి: వట్టే జానయ్య యాదవ్

బీసీల రాజకీయ, సామాజిక హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి.

ఉమ్మడి నల్గొండ జిల్లా , : కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు బీసీ సమాజం ఐక్యంగా కృషి చేయాలని బీసీ ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా ఎల్‌బీ నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మెజార్టీ వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో సాగుతున్న ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకుని ఉద్యమంలో కొనసాగిన ఆయన చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహనీయుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా కేవలం పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో సరిపెట్టకుండా వారి ఆశయాలను ఆచరణలోకి తీసుకురావాలని సూచించారు. బీసీల రాజకీయ, సామాజిక హక్కుల సాధన కోసం సమాజంలో విస్తృత చైతన్యం తీసుకురావాలని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించిన విధంగా అధికారంలో బీసీలకు సముచిత భాగస్వామ్యం కల్పించే దిశగా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బీసీల హక్కుల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రఘురాం, జల్ల నరేందర్, పోచబోయిన జగదీష్ యాదవ్, వాసుకే యాదవ్, నీరజ గౌడ్, వేణు, కన్నెబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top