తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

Spread the love

తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

కోదాడలో ఘనంగా 111వ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా/కోదాడ:
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ సాధన కోసం నిరంతరం పోరాడిన త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పద్మశాలి సేవా సంఘం నాయకులు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి పద్మశాలి సేవా సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు కొంగర నరసింహారావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సుమారు 400 మందికి అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 96 ఏళ్ల వయసులో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపట్టి తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించారని పేర్కొన్నారు.
అదేవిధంగా చేనేత రంగానికి అండగా నిలిచి, సహకార సంఘాల వ్యవస్థకు పునాది వేసిన ఆయనను చేనేత జాతిపితగా గుర్తించారని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సంగిశెట్టి గోపాల్, గొర్రె రాజేష్, రుద్ర నాగలక్ష్మి, అనబత్తుల వేణు, నక్క చంద్రం, గోలి నాగరాజు, పంతంగి నరేష్, పెండిప్రోలు శ్రీనివాసరావు, కొండ వీరభద్రం, రాపోలు శ్రీనివాస్, దేవరశెట్టి సైదులు, యలగందుల నరసింహారావు, నాగుల్, పరుశురాములు, కొండ శ్రీనివాసరావు, యలగందుల రాఘవయ్య, నక్క గోపి, యామిని, శీను, వనం వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, జిల్లా వీరభద్రం, నక్క రాము, దీకొండ సురేష్, గూడూరి కుమార్, రచ్చ రామచంద్రయ్య, చిట్టిప్రోలు కనకయ్య, నక్క వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top