సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

Spread the love

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ శంభీపూర్ లోని కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మంజూరు చేయించిన రూ.2,14,000 విలువల గల ఆరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తుందని అన్నారు. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు అర్కల అనంతస్వామి ముదిరాజ్, కోల సాయి యాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, నాయకులు శ్రీశైలం యాదవ్, డీజే రమేష్, జయం చారి, మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top