అభివృద్ధి పనులను పరిశీలించిన కొలన్ హన్మంత్ రెడ్డి

Spread the love

అభివృద్ధి పనులను పరిశీలించిన కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి 283 డేవిస్ గిరి నగర్ పరిధిలోని ఇందిరాగాంధీ నగర్, సౌభాగ్య నగర్, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఇందిరాగాంధీ నగర్‌లో ₹40 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన సీసీ రోడ్ల పనులను పరిశీలించి, పనుల పురోగతిని పర్యవేక్షించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు.

అనంతరం సౌభాగ్య నగర్‌లో కల్వర్టు పనులను పరిశీలించారు. అలాగే ఆదర్శ్ నగర్‌లో పాత సీసీ రోడ్లు, మరమ్మతులు అవసరమైన రోడ్లు మరియు కొత్త సీసీ రోడ్ల పనులను పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు బుయ్యని శివ కుమార్, డివిజన్ అధ్యక్షులు కనకరావు, జలీల్ ఖాన్, సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జైరామ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హన్మిరెడ్డి, తైలం శ్రీనివాస్, అజర్ (మైనారిటీ ప్రెసిడెంట్), శ్యామ్ (ఎస్సీ సెల్ ప్రెసిడెంట్), ప్రకాష్, చారి, మల్లారెడ్డి, మాధవి రాణి, చంద్రయ్య, చిన్నమ్మ, లక్ష్మిరెడ్డి, కె. లక్ష్మి, వరలక్ష్మి, నీలా గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఆదర్శ్ నగర్‌కు చెందిన సాంబశివరావు, సురేందర్, నాయుడు, వరలక్ష్మి , జయప్రదా రెడ్డి, రాజకుమారి; సుమిత్ర నగర్‌కు చెందిన చంద్రయ్య, శ్రీనివాస్, బ్రహ్మానందం, వెంకటేష్, సౌభాగ్య నగర్‌కు చెందిన రవీందర్ గుప్తా, సురేందర్ రెడ్డి, అఫ్సర్ ఖాన్, అమ్జద్, సమీ, షేర్ ఖాన్ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top