
కొంపల్లిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి
కొంపల్లి ఏఎంఆర్ గార్డెన్స్‌లో కొంపల్లి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీల అభ్యున్నతికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. కొంపల్లి పద్మశాలి ఆత్మగౌరవ భవనం కోసం ప్రభుత్వంతో మాట్లాడి స్థలం కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పద్మశాలి సంఘ చైర్మన్ మామిడాల ఉమాశంకర్, కొంపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ కె మల్లికార్జునరావు, సెక్రెటరీ శ్రీనివాసరావు, కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్‌తో పాటు పద్మశాలి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
