
కొంపల్లిలో ఘనంగా కీ.శే. కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు||
కొంపల్లిలో నిర్వహించిన కీ.శే. కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన నృత్య కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు. అలాగే పద్మశాలి సంఘం సభ్యులు, పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రెటరీ గోపాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఆది రెడ్డి మోహన్ రెడ్డి, సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ వర్మ, పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి ప్రవీణ్ మరియు సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
