
₹45 లక్షల నిధులతో బాచుపల్లి 2BHK పరిధిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ||
బాచుపల్లి 2BHK పరిధిలో ₹45 లక్షల నిధులతో మంజూరైన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రాంతానికి పరిశీలించారు.
ఇప్పటికే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన పూర్తికాగా, ఈ రోజు స్థలాన్ని సందర్శించి నిర్మాణ పనుల ఏర్పాట్లను పరిశీలించారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పనుల పురోగతి, నాణ్యతపై సంబంధిత నిర్వాహకులతో చర్చించారు.
ఈ సందర్భంగా బండారి లేఔట్ అధ్యక్షులు వారాగాని వాసు, సొసైటీ ప్రెసిడెంట్ బాలబ్రహ్మచారి, నందకుమార్, మల్లేష్, నర్సింహ గౌడ్, నీలకంఠం, ఉమర్, సంధ్య, వికాస్, రాజు, హేమంత్, ముజాహిద్, బాలకృష్ణ, శ్రీను మరియు వినయ్ తదితరులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
