స్వామి వారి సేవకు పూందమల్లి గొడుగులు – తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

Spread the love

స్వామి వారి సేవకు పూందమల్లి గొడుగులు – తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

తిరుపతి

తిరుమల బ్రహ్మోత్సవాలలో స్వామి వారి సేవకు చెన్నె పూందమల్లిలో వుండే పోవైషి అలమేలు మంగ ట్రస్ట్ నుండి 9 గొడుగులు తిరుపతిలో శ్రీ వ్యూహలక్ష్మీ ఆలయంలో పూజలు నిర్వహించి తిరుమలకు తీసుకెల్లడం జరిగిందని, ఈ పుణ్య కార్యంలో పాల్గొనడం సంతోషంగా వుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి డి.ఆర్.మహాల్ రోడ్ గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్దనున్న శ్రీ వ్యూహలక్ష్మీ అమ్మవారి ఆలయంలో సోమవారం ఉదయం పూందమల్లి నుండి తెచ్చిన 9 గొడుగులకు సరితా నాగరాజ్ ఆధ్వర్యంలో స్వాగతం పలికగ, శ్రీ వ్యూహలక్ష్మీ ఆలయ వ్యవస్థాపకులు మాసి కృష్ణమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించగా, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోవైషి అలమేలు మంగ ట్రస్ట్ ఫౌండర్ గోపాల కృష్ణ మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలుగా స్వామి వారి సేవకు గొడుగులను అందిస్తున్నామని, జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామి వారి సేవకు 9 గొడుగులను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ కుటుంబసభ్యులు గిరిజా, ఇదియ చందిరన్, యువశ్రీ, నిరంజన్ లు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు పోకల అశోక్ కుమార్, ఊకా విజయ్ కుమార్, బిజేపి పొనగంటి భాస్కర్, జనసేన రాజారెడ్డి, గూండల గోఫినాధ్, బండ్ల లక్ష్మీపతి, విజయలక్ష్మీ, పి.డి.చౌదరి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top