జిన్నారం మండల పరిషత్ కార్యాలయంలో MPDO వీడ్కోలు సమావేశం ముఖ్య అతిథులుగా ఎంపీపీ ధమ్మగౌని రవీందర్ గౌడ్ .
▪️ ఇటీవల జిన్నారం మండలం MPDO రాములు జిన్నారం మండలం నుండి బదిలీ అయ్యి వికారాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన బదిలీ అయిన సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ ధమ్మగౌని రవీందర్ గౌడ్ (MPP) హాజరయ్యారు వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా MPDO చేసిన సేవలను గుర్తుచేస్తూ మీలాంటి అధికారిని కోల్పోతున్నందుకు మేము ఎంతో బాధ పడుతున్నాం అని తెలిపారు. అలాగే నూతన MPDO గా విధులు నిర్వహించబోతున్నారు శ్రీమతి అరుణ రెడ్డి (MPDO) గారికి స్వాగతం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జనాభాయి, జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ రెడ్డి , జిన్నారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడ్డే కృష్ణ , వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు మరియు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.