Author: teja news

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష తన సచివాలయంలో రేపు కేబినెట్ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం చర్చించను న్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర విభజన చట్టం లోని పెండింగ్ అంశాలు, ఏపీతో ఉన్న సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశాలపై నివేదిక తయారుచేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల…

మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్వనపర్తి జిల్లాకు చెందిన మేకప్ ఆర్టిస్ట్ చెన్నయ్య (తేజ) హత్య జరిగిన విషయం తెలిసిందే. బోరబండ పోలీసుల వివరాలు.. యూసుఫ్గూడ వెంకటగిరిలో ఉండే చెన్నయ్యకు రహమత్నగర్ వాసి సంపత్ యాదవ్ (19)కు పరిచయముంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి సంపత్, చెన్నయ్య కలిసి నిమేమే గ్రౌండ్లో అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఈసమయంలో సంపత్ తన వద్ద ఉన్న కత్తితో చెన్నయ్యను చంపాడు. సంపతు పోలీసులు అరెస్ట్ చేశారు

హైదరాబాద్:ఎమ్మెల్సీ కవితనుబీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లు కలిశారు. ఉద యం 10 గంటలకు తీహార్ జైలులో ఉన్న కవితతో వీరిద్దరూ ములాఖాత్ అయ్యారు. అనంతరం తిరిగి ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కాగా, గత మార్చిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనిలాండరింగ్ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ రౌస్ ఎవెన్సూ కోర్టు ఆమెకు జుడీషియన్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలిం…

యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో ఏకంగా రూ.19.64లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇక ఈ మే తొలి 15రోజుల్లోనే రూ.10.70లక్షల కోట్ల పేమెంట్స్ జరిగాయి. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగే కొద్ది డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని ఆ సంస్థ అంచనా వేసింది.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటర్ స్లిప్పుల పంపిణీ వంద శాతం చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఆర్డీవోలు, తహశీల్దార్లతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ, ధరణి పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ కు, తమ ఓటు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

ఈవీఎం యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఈవీఎం యంత్రాలను భద్రపరచినస్ట్రాంగ్ రూమ్స్ నలువైపులా కేంద్ర పోలీస్ బలగాలు, జిల్లా ఆర్మ్ డ్ పోలీస్, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రతతో పాటు నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్టమైన రక్షణ వుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ…

ప్రశ్నించే గొంతుక.. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి. తన ఛానల్ ద్వారా అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి తప్పు చేసేవారు తన వారైనా ప్రత్యక్ష ఆధారాలతో నిలదీసి ప్రశ్నించే జర్నలిస్ట్ మన తీన్మార్ మల్లన్న ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని తమ తోటి పట్టభద్రులను తీన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని అశ్వరావుపేట పట్టణ ఎంపీటీసీ వేముల భారతి ప్రతాప్ అభ్యర్థన చేశారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం నల్గొండ…

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం అత్యధిక ఓటర్లు ఉన్న దేశం కూడా మనదే మన దేశానికి స్వతంత్రం అనంతరం 1952లో మొట్టమొదటిసారిగా జనరల్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు అక్షరాస్యత రేటు 20% మాత్రమే. దినపత్రికలు సైతం చదివే అక్షరాస్యులు 20% లోపే అయినప్పటికీ అప్పటి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటు వినియోగించుకున్నారు. ఇన్ని వసతులు ఇంత సాంకేతికత, రహదారుల వసతి లేనప్పటికీ అప్పటి కాలంలో నేటి ఓటర్లతో పోల్చుకుంటే అప్పటి ఓటర్లే…

బ్రహ్మోత్సవాలకి అందరికీ ఆహ్వానం స్థానిక రాముల వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో గోవర్ధనగిరి గౌడ్ సతీసమేతంగా రాములు వారికి శేష వాహనం సమర్పించుకున్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా పున: నిర్మించుకున్న శ్రీ కోదండ రాముల వారి దేవస్థానంలో, బ్రహ్మోత్స వాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతాయి భక్తులందరూ సందర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆ రామయ్య ఆశీస్సులు కోవూరు మండల ప్రజలకు ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ బండ్ల సురేష్,…