Spread the love

శ్రీరామ్ వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న బైరెడ్డి, దారపనేని

కనిగిరి సాక్షిత

కనిగిరి నియోజకవర్గం సిఎస్ పురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ రియల్టర్ శ్రీరామ్ శ్రీనివాసులు ధర్మపత్ని శ్రీమతి రత్నకుమారి దంపతుల కనిష్ట పుత్రిక సుస్మిత, నెల్లూరు జిల్లా కందుకూరు గ్రామ వాస్తవ్యులు శ్రీ శెట్టి వెంకట కృష్ణారావు శ్రీమతి సునీత లో ఏకైక పుత్రుడు వెంకట సాయి సుధీర్ ల వివాహ వేడుకలు రాత్రి పువ్వాడి రాధాకృష్ణ కళ్యాణ మండపము నందు రోహిణి నక్షత్ర యుక్త తులా లగ్న పుష్కరాంశమునందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి పాల్గొని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ వేడుకల్లో శ్రీరామ్ వెంకట్రావు, శ్రీమతి ప్రమీల దంపతులు, కనిగిరి బిజెపి నియోజకవర్గ ఇన్ చార్జ్ కొండిశెట్టి వెంకటరమణయ్య, పామూరు మాజీ సర్పంచ్ కావిటి వెంకటసుబ్బయ్య,అల్లు శ్రీనివాసులు దంపతులు, ఆకుల మోహన్, ఆకుపాటి వెంకటేష్, షేక్ షంషూర్, బండ్ల నారాయణ, పోక నాయుడు బాబు, మట్లే రాహుల్ యాదవ్, యరశింగు రాయుడు, శ్రీరామ్ వారి బంధుమిత్రులు, శ్రీ శెట్టి వారి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.