
నగరంలోని అన్ని ప్రాంతాలలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.
స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.మౌర్య
తిరుపతి నగరంలోని ఏ ప్రాంతంలో ఏమి జరిగినా తెలిసేలా అన్ని ప్రాంతాల్లో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భాగంగా నగరంలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయనున్న ప్రాంతాలను ఉదయం స్మార్ట్ సిటీ, నగరపాలక సంస్థ, పోలీసు అధికారులతో కలసి పరిశీలించారు. పలు మార్పులను అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐ.సి.సి.సి)ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా నగరంలో అన్ని ప్రాంతాల్లో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ముఖ్యంగా నగరంలోని ఏమి వస్తున్నాయి, వెళుతున్నాయి, తెలుస్తాయని తెలిపారు. నగరంలో ఎక్కడైనా రోడ్లపైన చెత్త వేసినా, చెత్త వాహనాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఫుట్ పాత్ లు ఆక్రమించినా, ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా, ఏవైనా నేరాలు జరిగినా తెలుసుకుని అరికట్టేందుకు వీలుంటుందని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, ఈ.ఈ.రవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసిపి లు బాలాజి, మూర్తి, స్మార్ట్ సిటీ, పోలీసు, ఏఈకామ్ ప్రతినిధులు అన్నారు.
