అభద్రతా రాజకీయమే జగన్ లో పైశాచికం
** రచ్చ చేయడమే జగన్ లక్ష్యంగా ఉంది
** చిత్తూరులో టీడీపీ రాష్ట్ర నేతలు వెంకిటీల సురేంద్ర కుమార్ ధ్వజం
చిత్తూరు: వరుస అక్రమాలకు పాల్పడిన కేసులు ఓ వైపు, తాజాగా తల్లి – చెల్లితో కుటుంబ వ్యవహార గొడవల కేసులు, దేశాన్నే కుదిపేస్తున్న “మద్యం కుంభకోణం” కేసులు….. ఇలా అనేక కేసుల్లో పీకల్లోతుకు ఇరుక్కున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డికి మనసు నిలకడ లేక, రాజకీయాల్లో ఉండలేమేమో… అనే అభద్రతా భావంతోనే పైశాచికత్వం పెరిగినట్టు ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. శుక్రవారం చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయం లో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన పొలిటికల్ క్రిమినల్ ఈవెంట్లలో భాగంగానే నెల్లూరు పర్యటనలో మరోసారి రచ్చ చేయించారని మండిపడ్డారు.
పచ్చి అబద్దాలు చెబుతూ ప్రజల్ని నమ్మించాలని చేస్తున్న కర్కష పనులకు జనం నుంచి చీదరింపులు వస్తున్నాయని గ్రహించిన జగన్ రెడ్డి… రెచ్చగొడుతూ విద్వేషాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి గా పరిపాలన చేసిన వ్యక్తి అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. పోలీసులను బెదిరించడం, రోప్ పార్టీకి అవతల ఉన్న పార్టీ శ్రేణులను దగ్గరకు రమ్మనమని సంకేతాలు ఇచ్చి రెచ్చగొట్టడం చూస్తుంటే జగన్ అసలు మనిషేనా అని అనుమానం వస్తుందని వ్యాఖ్యానించ్చారు. అలాగే చంద్రబాబు నాయుడుని బెదిరించే రీతిలో మాటలాడారని తెలిపారు.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చంద్రబాబు నాయుడు క్లాస్ మేట్లు అని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చంద్రబాబు నాయుడుని కొట్టాడని…. ఆ కక్షతో మిధున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టాడని తీవ్రమైన అభ్యంతకర పదజాలం వాడిన జగన్ కు కాలమే బుద్ధి చెబుతుందన్నారు. ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. అసలు అలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని…. వాళ్ళు ఇద్దరు అసలు క్లాస్ మేట్లు కారని పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డిలాగా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు చేప్పట్టే నాయకుడు కాదని తెలిపారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కక్ష సాధించాలంటే ఎప్పుడో చేసి ఉండేవారని వివరించారు.
నెల్లూరు పర్యటనలో సిటీలో 8 కిలోమీటర్లు పైగా అనుమతి లేని రోడ్ షో చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసారని మండిపడ్డారు.
ఇలాంటి ఘటనలతో జగన్ భద్రతతో పాటు ప్రజల భద్రతకు ప్రమాదకర పరిస్థితులు సృష్టిస్తున్నారన్నారు. బల ప్రదర్శనలు కోసం పరామర్శల పొలిటికల్ స్టార్ సాగించిన దొంగ పరామర్శలు సాగవని హేచ్చరించారు. వైసీపీ లో ఇప్పుడు ఒక్క మహిళా నేత కూడా పక్కన లేకుండా జగన్మోహన్ రెడ్డి మహిళను నీచంగా తిట్టిన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించాడని…అంటేనే జగన్ తత్వం అర్ధం చేసుకోవచ్చు అన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి
వ్యాఖ్యలు ఆ పార్టీ మహిళా నేతలకు కూడా నచ్చలేదని గుర్తు చేశారు. ప్రజా నాయకుడికి ఉండవలిసిన లక్షణం ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
