TEJA NEWS

పరవాడలో వై.ఎస్ రాజ్ శేఖర్ రెడ్డి 15 వ వర్దంతి వేడుకలు

అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రంలో కీ౹౹శే దివంగత మహానేత ముఖ్యమంత్రి డా౹౹ వై.ఎస్ రాజ్ శేఖర్ రెడ్డి 15 వ వర్దంతి సందర్భంగా మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరవాడ సంతబయలు వద్ద ముఖ్య అతిధిలు గా పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, పరవాడ జడ్పీటీసీ పైల సన్యాసిరాజు విచ్చేసి మండల పార్టీ అధ్యక్షుడు కోనరామారావు పార్టీ సీనియర్ నాయకులు చుక్క రామునాయుడు వైస్ ఎం.పి.పి బూస అప్పలరాజు తో కలిసి వై.ఎస్.ఆర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్ లు పళ్ళు నాయకులు వెళ్ళి పంచారు ఈ సందర్భంగా ముఖ్య అతిదులు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి మరణించి 15 సంవత్సరాలు అయింది అంటే ఇంకా కలగానే ఉందన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలను తెలుసుకొని తను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అని అన్నారు. రచ్చబండ కార్యక్రమానికి హాజరు అవుతూ, హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారన్న వార్త విని వందలాది గుండెలు ఆగిపోయాయి అని అన్నారు. మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి మన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించగా కాంగ్రెస్ అధిష్టానం ఏవిధంగా అడ్డు కుoదో అందరికీ తెలుసు అని అన్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ఓదార్పు యాత్ర చేసి తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలన్న సంకల్పంతో ముందుకు సాగారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలు రాజశేఖర్ రెడ్డి పాలనకు నిదర్శనమని అన్నారు. తండ్రి ఆలోచనలకు అనుగుణంగానే సుపరిపాలన అందించేందుకు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేసారని, తండ్రి అడుగుజాడల్లోనే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను, వారు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకుని, నేను విన్నాను నేను వున్నానంటూ, రాష్ట్ర ప్రజలకి భరోసా కలిపించారని, పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కటి కుడా తూచా తప్పకుండా 98 శాతం హామీలను నేరవేర్చి తండ్రికి తగ్గ తనయుడు గా నిరూపించుకున్నారు అని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో వైసిపి ముఖ్య నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS