వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శిగా దాసరి చిట్టిబాబు నియామకం

TEJA NEWS

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శిగా దాసరి చిట్టిబాబు నియామకం

చిలకలూరిపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది, మాజీ ఏజీపీ దాసరి చిట్టిబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి లభించింది. పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ విభాగ సంయుక్త కార్యదర్శిగా చిట్టిబాబును నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఆవిర్భావం నుండి గత రెండు దశాబ్దాలుగా పార్టీ పట్ల విధేయతతో ఉంటూ, న్యాయపరమైన సేవలు అందిస్తున్న ఆయన నిబద్ధతను గుర్తించి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బాధ్యతను అప్పగించారు. విధేయతకు దక్కిన గుర్తింపు గతంలో ప్రభుత్వ ప్లీడర్‌గా (AGP) పనిచేసిన చిట్టిబాబు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి న్యాయపరమైన అంశాల్లో చురుకైన పాత్ర పోషించారు. పల్నాడు జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషిని, మాజీ మంత్రి విడుదల రజిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె సహకారంతో చిట్టిబాబుకు ఈ రాష్ట్ర స్థాయి పదవి దక్కింది.జగన్‌కు, రజినికి కృతజ్ఞతలు తన నియామకం పట్ల దాసరి చిట్టిబాబు హర్షం వ్యక్తం చేశారు. తన సేవలను గుర్తించి పదవిని అప్పగించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తనకు రాజకీయంగా అండగా నిలిచిన మాజీ మంత్రి విడుదల రజినికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు అండగా ఉంటూ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ నియామకం పట్ల స్థానిక పార్టీ నాయకులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top